Saturday, June 12, 2021

కుక్క‌ల దాడితో కాల్వ‌లో ప‌డి నిడ‌ద‌వోలు చైర్మ‌న్ స‌తీమ‌ణి దుర్మ‌ర‌ణం….

నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు ప్రమాదవశాత్తు గోదావరి కాల్వలో పడి మృతి చెందారు. నేటి ఉదయం నడక కోసం వెళ్తుండగా.. ఆమెపై కుక్కలు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కాల్వ మెట్లపైకి దిగారు. దీంతో మెట్లపై నుంచి జారి కాల్వలోకి పడిపోయారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ప్రవాహవేగానికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఉండ్రాజవరం కాల్దారి వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News