Wednesday, April 24, 2024

ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.30 ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం..

ఏలూరు జిల్లాలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లో గల భాష కార్ ఆటో మొబైల్స్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షాపులో భారీగా ఎత్తున మంటలు ఎగిసిప‌డ్డాయి. వెంట‌నే స్థానికులు పోలీసు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్ర‌మాదంలో ఐ20 కార్ అగ్నిలో కాలిబూడిదైంద‌ని, సుమారు రూ.30 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement