Friday, February 3, 2023

BREAKING : ప‌.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆర్టీసీ బ‌స్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందిన‌ట్లు స్థానికులు తెలిపారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీశారు. మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement