Thursday, March 28, 2024

గ్రేట‌ర్ అల్లుడికి 173 ర‌కాల‌తో అత్తింటి అతిథ్యం..

భీమవరం- వెటకారం, మమకారం ల‌కు పెట్టింది పేరు ఉభ‌య గోదావ‌రి జిల్లాలు..అతిథి మ‌ర్యాద‌ల‌లో గోదారోళ్ల‌ను మించినోళ్లు లేరంటే అతిశ‌యోక్తి కాదు.. ఇప్ప‌డు ఇదంతా ఎందుకంటే హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన అల్లుడికి అత్తింటి వారు చేసిన మ‌ర్యాద‌లు చూస్తే అస‌లు విష‌యం తెలుసుంది.. హైద‌రాబాద్ కు చెందిన పృథ్వీ గుప్తా సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా భార్య‌తో స‌హా అత్తింటి ఊరు భీమవరానికి వ‌చ్చాడు.. అల్లుడు పండుగ‌కు రావ‌డంతో మామ‌, వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ -సంధ్య దంపతులు ఏకంగా 173 రకాల వంటలతో శనివారం విందు భోజనం పెట్టారు. అస‌లే న‌గ‌రం అల్లుడు.. ఇన్ని వంట‌కాలు చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు.. ఇన్నీ తినాలా అని భార్య‌ను అడిగితే త‌ప్ప‌ద‌ని జ‌వాబిచ్చింది..స‌రే అత్తింటి అతిధ్యం కాద‌న లేక వండిన వంట‌కాల‌న్నీ కొద్దికొద్దిగా రుచి చూసి ఆ కుటుంబాన్ని ఆనంద‌ప‌రిచాడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ అల్లుడు.. ఈ వంట‌కాల‌లో
సేమ్యదద్దోజనం, పెసర పునుకుల పలావు, కొబ్బరి పలావు, పెసర వడలు, తమలపాకు బజ్జీ, వంకాయ బజ్జీ, స్వీట్స్‌లో శనగపప్పు బూరెలు, పాకం గారెలు, ఎర్రనూక హల్వా, ఆకు పకోడి, సగ్గుబియ్యం వడలు వంటి రకాలతో పాటు వివిధ పండ్లు, పొడులు, అప్పడాలు, వడియాలు, బిర్యానీలు, పచ్చళ్లు, వేపుళ్లు, పప్పు కూరలు, ఆకు కూరలతో పాటు పలు రకాల ఐస్‌క్రీమ్స్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement