Friday, September 22, 2023

AP : బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు వెళ్లి.. ముగ్గురు మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డ్డ బాలుడిని కాపాడేందుకు య‌త్నించిన ఇద్ద‌రితో పాటు బాలుడు మృతిచెందిన విషాద ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మాచవరం మండలం మోర్జంపాడులో ఈరోజు మధ్యాహ్నం మేకలను మేత కోసం ముగ్గురు గ్రామ శివారులోకి వెళ్లారు. వీరి వెంట ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. బాలుడిని రక్షించేందుకు బావిలో దూకిన మరో ఇద్దరు బావిలోనే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement