Friday, April 19, 2024

వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి – గ‌వ‌ర్న‌ర్ న‌జీర్

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు.. సమావేశాలకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, లీడ‌ర్ ఆఫ్ ది హౌస్‌, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, అధికార సభ్యులు, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు హాజరయ్యారు. అంత‌కుముందు అసెంబ్లీకి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌స్వాగతం ప‌లికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ప్రసంగిస్తూ, ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్‌ తెలిపారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు..
జగనన్న గోరుముద్ధతో43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
జగనన్న గోరుముద్ధ ద్వారా ఇప్పటి వరకు రూ.3,239 కోట్లు ఖర్చు
ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
వ్యవసాయ రంగానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్
పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల పనులు వేగవంతం
అమ్మ ఒడి ద్వారా ల‌క్ష‌లాది మంది కి ల‌బ్ది
శ‌ర‌వేగంగా పారిశ్రామిక అభివృద్ది.
గ్లోబ‌ల్ ఇన్సెస్ట‌ర్స్ స‌మిత్ ద్వారా వేల కోట్ల రూపాయిలు పెట్టుబుడులు
ల‌క్ష‌ల సంఖ్యలో ఉద్యోగాలు…

Advertisement

తాజా వార్తలు

Advertisement