Monday, December 9, 2024

Breaking | పెండ్లి ట్రాక్టర్‌ బోల్తా, ఏడుగురు మృతి.. చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌

చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్‌ లక్ష్మయ్య ఊరు సమీపంలో అదుపుతప్పి పెద్ద గుంతలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌తోపాటు ఏడుగురు చ‌నిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్​లో మొత్తం 25 మంది ఉన్నట్టు తెలుస్తోంది.

చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను ఐరాల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఇదే మండలానికి సమీపంలోని కాణిపాకం వద్ద గత నెలలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న పాల ట్యాంకర్‌ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చ‌నిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement