Wednesday, April 24, 2024

Weather: నైరుతీ జర్నీ ముగిసింది.. ఈ వారం ఎండింగ్ లో వర్షాలుండొచ్చు..

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ముగిసిందని భారత వాతావరణ శాఖ ప్రకటిం చింది. ఈ ఏడాది అక్టోబర్‌ 6న ప్రారంభమైన ఉపసంహరణ, ఐదునెలల ఈ సీజన్‌ ముగింపుదశకు 20 రోజులు పట్టిందని పేర్కొంది. ఈ ఏడాది దేశంలో అసాధారణ వర్షపాతం న‌మోదైంది. ఇది దీర్ఘకాల సగటులో 109శాతం. వర్షాధార కార్య కలాపాలు సెప్టెంబర్‌లో గణనీయంగా పుంజుకున్నాయి. అక్టోబర్‌లో ఉపసంహరణ దశలో కొనసాగాయి.

ఫలితంగా ఉత్తరాఖండ్‌, ఢిల్లి, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, అసోం, సిక్కిం, మేఘాలయ వంటి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అక్టోబర్‌ 15 నాటికి పూర్తిగా ఉపసంహరించు కుంటాయి. ఆ తర్వాత రుతు పవనాలు తమ దిశను మార్చుకుని ఈశాన్యం దిశలో సమ లేఖనం చేస్తాయి. ఈశాన్య రుతు పవనాల వర్షపాతం మం గళవారం నుంచి ప్రారంభం అవుతుందని ఐఎండీ తెలిపింది. ఈ వారం చివరి వరకు కేరళ, తమిళనాడు, కారైకల్‌, పుదుచ్చేరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement