Thursday, April 25, 2024

శ్రీశైల క్షేత్రంలో మాదిగ అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తాం: మంత్రి వెల్లంపల్లి

అమరావతి, ఆంధ్రప్రభ : శ్రీశైలం దేవస్థానంలో మాదిగ సామాజిక వర్గానికి అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాలలో వైకాపా సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ ఈ అంశంపై ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు శ్రీశైలం దేవస్థానంలో ఉన్నాయని అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి కూడా ఒక అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికోసం స్థలాన్ని కేటాయించాలని మంత్రిని కోరారు.

ఈ సత్రం ఏర్పడితే మాదిగల ఆత్మగౌరవం కాపాడినట్లు అవుతుందని పే ర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సమాధానమిస్తూ ప్రత్యేక అన్నదాన సత్రం ఏర్పాటుకు అనుమతిస్తామని, స్థలంతో పాటు భవన నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి అనుమతులు మంజూరు చేయిస్తామని భరోసానిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement