Monday, May 29, 2023

Big Breaking: విశాఖ నుంచే పరిపాలన సాగిస్తాం… వైవీ సుబ్బారెడ్డి

ఏప్రిల్ లోపు రాజధాని విశాఖకు తరలిపోతుందని, విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖ వస్తే సీఎం ఎక్కడుంటారనేది సమస్య కాదన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామన్నారు. ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. విశాఖ గర్జనలోనే తాము రాజధాని మారుస్తామని చెప్పామన్నారు. ఏప్రిల్ లోపు న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్ గా వాడుకుంటామన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement