Wednesday, November 6, 2024

AP | నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం.. టీజీ భరత్

కర్నూలు బ్యూరో : కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యం శాఖల మంత్రి టి.జి. భరత్, నగర మేయర్ బి.వై.రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ కాలనీలోని కౌన్సిల్ హాలులో మేయర్ అధ్యక్షతన నగర పాలక పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి, కమిషనర్ ఎస్.రవీంద్రబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ… నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంతవరకు ప్రజలకు పగటిపూటే నీళ్ళు అందించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. పేద ప్రజలకు కమ్యూనిటీ భవనాలు ఎంతో అవసరమని, నగరంలో పలుచోట్ల కమ్యూనిటీ భవనాల్లో ఉన్న సచివాలయాలను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు లేఖ సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈకార్య‌క్ర‌మంలో మేయర్, ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కమిషనర్ లు పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యాధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్ఈ రాజశేఖర్, ఆర్ఓలు జునైద్, ఇజ్రాయిల్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ ఈఈ చంద్రమోహన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 కే నాణ్యమైన, రుచికరమైన ఆహారం…
కర్నూలు, అక్టోబర్ 25 : పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకే అందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగం పక్కన ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పేదలకు అవసరమైన ప్రదేశాల్లో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 2 అన్న క్యాంటీన్లను ప్రారంభించుకున్నామని ఈరోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన 3వ అన్న క్యాంటీన్ ప్రారంభించుకుంటున్నామని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో 5 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని, కల్లూరు పరిధిలోని పరిమళ నగర్, సెట్కూర్ కార్యాలయం వద్ద, కలెక్టరేట్ ఆవరణలో, పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు సమీపంలో ఒక్కటి, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒక్కటి మొత్తం 5 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్.కె ప్రకాష్, వివిధ విభాగాల వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement