Saturday, November 26, 2022

డిసెంబర్ 23లోగా భూ రీ సర్వే పూర్తి .. సీఎం జగన్

భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని, డిసెంబర్ 23లోగా రీ సర్వే పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… 17,580 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేస్తున్నామన్నారు. 7లక్షల 92వేల మంది రైతుల భూ సర్వే జరుగుతుందన్నారు. భూముల విలువ పెరగడంతో అక్రమాలు పెరుగుతున్నాయన్నారు. శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement