Friday, September 24, 2021

హస్తినలోనే అమీతుమీ: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు ఉధృతం

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాట కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏపీలో ఆందోళను చేసిన కార్మికులు ఇప్పుడు ఢిల్లీకి ఆందోళనలు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నప్పటికి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. తాాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన తర్వాతే కల సాకారమైందన్నారు కార్మిక సంఘాల నేతలు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగాలక్తెనా సిద్దమని హెచ్చరిస్తున్నారు. రేపు , ఎల్లుండి .. రెండు రోజుల పాటు జంతర్‌మంతర్‌ దగ్గర మహాధర్నాకు హాజరవుతారు కార్మిక సంఘాలు, వాటి ప్రతినిధులు తెలుగు ప్రజల ఉద్యమస్పూర్తిని చాటిచెబుతామంటున్నారు.

ఇది కూడా చదవండి: ట్రిపుల్‌ ట్రిపుల్‌ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికెషన్ విడుదల..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News