Saturday, February 4, 2023

Accident: ప్రమాదానికి గురైన పోలీసు వాహనం.. సీఐ మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో ఎండాడ కూడలి వద్ద పోలీసు వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 టౌన్ సీఐ ఈశ్వరరావు మృతి చెందగా.. డ్రైవర్ సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై విశాఖ సీపీ మనీష్ కుమార్ స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదలోం సీఐ ఈశ్వర రావు (58) లో మరణించారని తెలిపారు. కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలతో హాస్పిటల్ కు తరలించినట్లు వివరించారు. మరో రెండు సంవత్సరాలలో రిటైర్మెంట్ ఉండగా.. సీఐ ఈశ్వర రావు మృతి చెందడం బాధకారమన్నారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలుస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement