Tuesday, October 1, 2024

వివేకా హ‌త్య కేసు – నాలుగేళ్లుగా సా….గ‌….దీ…త‌….

కడప, బ్యూరో,ప్రభన్యూస్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచ లనం రేకెత్తిం చిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసు ఎప్ప టికప్పుడు మలుపులు తిర గడం తప్ప ఇప్పటిదాకా విచారణ ఓ కొలిక్కి రా లేదు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ హ త్యకేసు ఛేదించేందుకు ఇప్పటివరకు రెండు విచా రణ బృం దాలు రంగం లోకి దిగినా విచారణ కొలిక్కి రాలేదు. కాలం గడిచిపోవడం తప్ప ఈ కేసులో దాగి ఉన్న కుట్ర కోణం వెలుగులోకి రాలేదు. తాజాగా ఈ కేసు పై విచారించిన భారత సర్వోన్నత న్యాయస్థానం విచారణ పురో గతిపై అసహనం వ్యక్తం చేస్తూ మరో విచా రణ బృందంగా కొత్త సిట్‌ను ఏర్పాటు- చేసింది. కె.ఆర్‌ చౌరాసియా నేతృత్వంలో ఐదు గురు సభ్యులతో ఏర్పా-టైన ఈ కొత్త బృందం వివేక హత్యకేసులో మూడో విచారణ బృందంగా రంగంలోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30 లోగా విచారణ ముగించాలని ఆదేశించింది. ఇకనైనా ఛేదించేందుకు విచా రణ సవ్యంగా సాగుతుందా! మళ్లీ ఇలాంటి ఇబ్బందులు, రకరకాల ట్విస్ట్‌ లు ఏవైనా ఎదుర వుతాయా అన్న వాదనలు సహజంగానే తలెత్తుతున్నాయి.

ఆది నుంచీ ఆటంకాలే!
రాజకీయ రంగు పులుముకున్న వివేక హత్య కేసు విచారణ ఆది నుండి అడ్డంకుల మధ్య సాగుతోంది. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. ఆ సమాచారం బయటకు రావడమే వివాదాస్పదంగా వచ్చింది. మొదట్లో గుండెపోటని ప్రచారం, అంతలోనే హత్య అని నిర్ధారణ. ఇలాంటి పరిణామాలు ఈ కేసును మరింత కుట్ర కేసుగా చూపించాయి. ఇదే తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజకీయంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం, అందునా హత్యకు గురి అయింది సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో ఈ హత్యకేసు సంచలనంగా మారింది .అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ హత్య కేసును ఛేదించేందుకు సిట్‌ ను ఏర్పాటు- చేయడం జరిగింది. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి, ఆయన కుటు-ంబ సభ్యులు కొందరు ఈ కేసును సిపిఐ కి అప్పగించాలని కోరారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసు సిబిఐకి అప్పగించాలని తెలుగుదేశంతో పాటు- హత్యకు గురైన వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కోరారు.ఈ మేరకు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది. అప్పటివరకు విచారణ చేపట్టిన సిట్‌ విచారణ పక్కకు పోయింది. ఆ తర్వాత 2021 నుంచి సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణ అధికారిగా రామ్‌ సింగ్‌ నేతృత్వం వహించారు. సిబిఐ విచారణ మొదలైనప్పటి నుండి వివాదాలు, అడ్డంకులు, కేసులు, బెదిరింపులు లాంటివి తెర మీద వచ్చాయి. సిబిఐ అధికారులు తమను బెదిరిస్తున్నారని కొందరు, తమ విచారణకు కొన్ని రకాల అడ్డంకులు ఎదురౌతున్నాయన్న భావనలో సిబిఐ కనిపించింది. ఇలా వివేక కేసు విచారణ, వివాదాల మధ్య సాగుతూ వచ్చిందని చెప్పవచ్చు. అయినప్పటికీ సిబిఐ అధికారులు విచారణ కొనసాగిస్తూ వచ్చారు. ఈ కేసులో నిందితులు, సాక్షుల వాంగ్మూలం మేరకు రెండు చార్జీ షీట్లు- దాఖలు చేశారు.

వాంగ్మూలాల తర్వాత ట్విస్ట్‌లు
వివేక నంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వాంగ్మూలాలను సేకరించి, చార్జ్‌ షీట్లు- దాఖలు చేసిన తర్వాత పలు రకాల వాదనలు బయటకు వచ్చాయి.ఈ కేసులో ఐదుగురి స్టేట్‌ మెంట్‌ మేరకు ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఏ1గా ఎర్రగంగిరెడ్డి, ఏ2గా సునీల్‌ కుమార్‌ యాదవ్‌, ఏ3గా ఉమా శంకర్‌ రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శంకర్‌ రెడ్డిలను ఎఫ్‌ఐఆర్‌ లో సిబిఐ చేర్చింది. ఈ హత్య వెనుక వెనక ఉన్న కుట్రదారులు ఎవరు అనే కోణంలో సిబిఐ విచారణ చేపట్టింది. అయితే సిబిఐ అధికా రులు తమను బెదిరిస్తున్నారని కొందరు ఆరోపణలు చేయ డం, సిబిఐ అధికారులు కూడా తమకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది.

రామ్‌ సింగ్‌ పై కేసు
ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో దర్యాప్తు అధికారి, సిబిఐ ఎస్పి రామ్‌ సింగ్‌ పై కడపలో కేసు నమోదు అయింది. తప్పుడు సాక్షాలు చెప్పాలంటూ రామ్‌ సింగ్‌ తనని బెదిరిస్తున్నారని, దాడి చేశారని ఆరోపిస్తూ, ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా పోలీసులు రాంసింగ్‌ పై 2022 ఫిబ్రవరి 18న కేసు నమోదు చేశారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో ఆ కేసుపై పై స్టే వచ్చింది. ఇదిలా ఉంటే ”సిబిఐ బృందం కడప నుంచి వెళ్లిపోవాలి, లేకుంటే బాంబులు వేసి పేల్చేస్తా, ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి” అంటూ ముసుగు ధరించిన వ్యక్తి తనను బెదిరించారని సిబిఐ అధికారుల వాహన డ్రైవర్‌ షేక్‌ వల్లి భాష 2022 మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఓ సాక్షి మృతి
వివేకా కేసులో నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్‌ రెడ్డికి అనుచరుడైన గంగాధర్‌ రెడ్డి 2022 జూన్‌ లో మృతి చెందారు. గంగాధర్‌ రెడ్డి ఈ కేసులో సాక్షి ఉండేవారు. ఆయన్ను సీబీఐ మూడుసార్లు విచారించింది. పులివెందులకు చెందిన గంగాధర్‌ రెడ్డి అనంతరం జిల్లా యాడికి లో నివాసం ఉంటూ రాత్రి నిద్రలో చనిపోవడం జరిగింది .అప్పట్లో ఆయన మృతి పై అనుమానాస్పద కోణంలో విచారణ చేపట్టడం జరిగింది.ఇలాంటి పలురకాల పరిణామాలు వివేకా హత్యకేసు విచారణ సమయంలో చోటు- చేసుకున్నాయి.

కేసు విచారణ తెలంగాణ కు బదిలీ
వివేకా హత్య కేసు విచారణ ఏపీలో జరిగితే న్యాయం పొందలేమని,ఈ కోర్టును వేరే రాష్ట్రాన్రికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 ఏప్రిల్‌ లో ఈమేరకు రిట్‌ దాఖలు చేశారు. 2022 అక్టోబర్‌ 19న తీర్పు రిజర్వ్‌ చేసి ,2023 జనవరి 29న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టుకు కేసు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సిబిఐ అధికారులు మరింత వేగం పెంచి,విచారణ చేపట్టారు. ఆ తర్వాతే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి నాలుగు సార్లు నోటీ-స్‌ లు ఇచ్చి విచారణకు సిబిఐ పిలిచింది,ఆ మేరకు అవినాష్‌ హాజరౌతూ వచ్చారు.ఇదే సమయంలో తనను అరెస్ట్‌ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ కోర్టు ను ఆశ్రయిం చడం, అలాంటి ఆదేశాలు చేయజాలమని పేర్కొంటూ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ కొత్త సిట్‌ ను ఏర్పాటు చేయాలని ఆదేశించ డం. ఆ మేరకు హత్య కేసు విచారణకు కె ఆర్‌ చౌరాసియా నేతృతంలో కొత్త సిట్‌ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు- కావడం వివేకా కేసులో మరో ఆసక్తికర పరిణామంగా మారింది. మరి ఇకనైనా కేసు విచారణ సవ్యంగా సాగి కోర్టు ఆదేశించిన మేరకు ఏప్రిల్‌ 30 నాటికి విచారణ పూర్తవు తుందా? అదే జరిగితే కుట్ర కోణంలో ఎలాంటి దిగ్భ్రాంతి కలిగించే అంశాలు బయట పడతాయి? కుట్రదారులు ఎవరు? అనే సందేహాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement