Friday, March 29, 2024

నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు..మొహానికి అంటుకున్న మంట‌లు..

నేల వేషాల కార్య‌క్ర‌మంలో అపశృతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని మొహానికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. మొహం, ఛాతి భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే అతడిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘ‌ట‌న విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement