Monday, May 17, 2021

మూడో రోజుకి చేరిన‌ కేఏపాల్ నిర‌శ‌న దీక్ష‌..

విశాఖపట్నం : భారత్‌లో వచ్చినన్ని కరోనా కేసులు.. ప్రపంచంలో మరెక్కడా రాలేదని కేఏపాల్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కేఏపాల్ చేపట్టిన నిర‌శ‌న‌ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో డేంజర్ పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన సలహాలు తీసుకుని తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారు. జగన్ రాజకీయ శత్రువుగా మారుతున్నారని తెలిపారు. ‘‘సోమవారం కోర్టు తీర్పు కచ్చితంగా రద్దు చేయాలని వస్తుంది… ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి… నేను వెంటనే దీక్ష విరమిస్తాను’’ అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని తెలిపారు. డూప్లికేట్, డాక్టర్లు, పోలీసులను పంపించి కేజీహెచ్‌లో తనను చంపడానికి ప్రయత్నించవద్దని… తనను చంపినా ఇక్కడే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. బీపీ, షుగర్ లెవెల్‌ బానే ఉన్నాయన్నారు. ‘‘నేను గతంలో ఉపవాస దీక్షలు చేశాను.. నాకు గురించి ఏమి భయపడక్కర్లేదని… నాకేం కాదు..వాయిదా వేయండి నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తాను’’ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News