Saturday, April 20, 2024

ఏపీకి బయల్దేరిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

విశాఖపట్నం: రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రానుంది. పశ్చిమ్‌బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి నుంచి 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి బయల్దేరింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ను విశాఖపట్నం, నెల్లూరులో స్టేషన్లలో అన్‌లోడ్ చేయనున్నారు. ప్రాణవాయువు అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రావడం ఇదే తొలిసారి._ _రాష్ట్రంలో రోజుకు దాదాపు 600  టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతున్నప్పటికీ.. రోడ్డు మార్గాల ద్వారానే తమిళనాడు, ఒడిశా నుంచి సరఫరా అవుతోంది. తాజాగా రవాణా సమయాన్ని తగ్గించేలా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సమ్మతించింది.._

Advertisement

తాజా వార్తలు

Advertisement