Thursday, April 25, 2024

సింహగిరిపై వైభవంగా ధన్వంతరి హోమం

స్వాతి నక్షత్ర హోమం పూజలు..కనుల పండుగ గా . సుదర్శన యాగం,..కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామికి వేడుకో లు.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సోమవారం ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు., తెల్ల వారు జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన గావించారు.. గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం గావించారు.. అనంతరం ఆలయం పక్కనే ఉన్న యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలు..ఆ తర్వాత సుదర్శన..నారసింహ ధన్వంతరి హోమాలు వైభవంగా జరిపించారు,, లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని. ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వo తరీ హోమం నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలిపారు..ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ను కరోనా భయం వెంటాడుతుంది అని, ఇటువంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహించినట్టు అయితే అటువంటి భయాల తోపాటు వ్యాధులు రుగ్మతలు కూడా పూర్తిగా తొలగి పోతాయని భావించి ఈ హోమం నిర్వహించామని రాజగోపాల్ చెప్పుకొచ్చారు..గతంలో కంచి తో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వoతరీ హోమం తో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడం తో ఆ ప్రాంతంలో వ్యాధులు..జబ్బులు.భయాలు పూర్తిగా మటుమాయం అయ్యాయన్నారు.,. దీంతో సింహాచలంలో కూడా ఆలయ చైర్పర్సన్ సంచియిత గజపతిరాజు సూచనలు మేరకు ఈ ధన్వంతరి హోమం నిర్వహించామన్నారు,, దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని..త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారు అని రాజగోపాల్ వివరించారు,, ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తదితరులు ఈ హోమం లో పాల్గొన్నారు.. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలక్రిష్ణమచార్యులు..గొడవర్తి శ్రీనివాసా చార్యులు అలంకార్..పురోహితులు కరి సీతా రామా చార్యులు..రాజీవ్ లోచన తో పాటు పలువురు అర్చకులు..వైదిక వర్గాలు పాల్గొన్నాయి…హోమం అనంతరం ఆలయ బేడా మండపం లో పూజలు జరిపిన కలిస తో ప్రదక్షిణ లు నిర్వహించి..స్వామికి చూపించారు.వేద మంత్రాలూ..మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ వైభవం గా జరిపించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement