Tuesday, November 28, 2023

పురుగు మందు తాగి దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

పురుగు మందు తాగి దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న అల్లూరిలోని భల్లుగూడ హాస్టల్‎లో చోటు చేసుకుంది. హాస్టల్‎లో ఇద్దరు దంపతులు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుమన్, రాధా ఇద్దరు గత అర్ధరాత్రి పురుగుల మందు తాగి హాస్టల్‎లోనే మృతి చెందడంతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంట‌నే హాస్ట‌ల్ లోని వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే హాస్ట‌ల్ కు వ‌చ్చిన పోలీసులు వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement