Thursday, April 25, 2024

ప‌డ‌కేసిన మాన‌వ‌త్వం – బెడ్ కొర‌త‌తో ఆగిన చిన్నారి ఊపిరి

ఆక్సిజన్‌ బెడ్‌ అందక నరక యాతన
ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులు
అంబులెన్స్‌లోనే కొనసాగిన చికిత్స
కరోనాకు గురైన ఏడాదిన్నర బాలిక
బెడ్లు లేవని చేర్చుకోని సిబ్బంది

విశాఖపట్నం : విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చొడిపల్లి గ్రామానికి చెందిన వీరబాబు(సీఐఎస్‌ఎఫ్‌) కుమార్తె. ఏడాదిన్నర వయస్సున్న సాహ్నివికకు నాలుగు రోజుల క్రితం జలబు,జ్వరం వచ్చాయి. దీంతో స్ధానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుప్రతికి, ఆ తరువాత అనకాపల్లిలోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లారు.ఎందుకైనా మంచిదని ఆ చిన్నారికి రాపిడ్‌ విధానంలో కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. మూడు రోజుల పాటు- అదే ఆసుప్రతిలో వైద్యం అందించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మరోసారి ఆర్‌టీ-పీఆర్‌ విధానంలో కోవిడ్‌ పరీక్ష చేయించాలని వైద్యులు చెప్పారు. అక్కడ చికిత్స సరిగా లేదని భావించిన వారు గాజువాకలోని మరో ప్రైవేట్‌ ఆసుప్రతికి తీసుకువెళ్లారు.దీంతో వారు స్కానింగ్‌ చేసి కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారించి పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో విశాఖలోని కేజీహెచ్‌కు మంగళవారం అంబులెన్స్‌లో ఆ చిన్నారిని తీసుకువచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక బెడ్లు ఖాళీ లేవంటూ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ సిబ్బంది చిన్నారి తల్లిదండ్రులను నిలిపివేశారు. అంబులెన్స్‌లోనే గంటకుపైగా చిన్నారికి ఆక్సిజన్‌ అందిం చారు.ఇదే సమయంలో చిన్నారి బంధువులు ఆసుప్రతి రిసెప్షన్‌ సెంటర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అంబులెన్స్‌లోనే చిన్నారి మృతి చెందినట్టు- తండ్రి వీరబాబు మీడియాకి తెలిపారు. ఈ ఉదంతంపై కేజీహెచ్‌ వైద్యులు కనీసం స్పందిచలేదు. కేవలం కేజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిందంటూ రోగి బంధువులు ఆందోళన చేపట్టారు.
భవనంపైనుంచి పడి మరో రోగి మృతి
విశాఖ నగరానికి చెందిన ఎ.వెంకటరావు(42) కేజీహెచ్‌ ఆంధ్ర బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.అయితే ఈ నెల 25వ తేదీన కరోనా పాజిటివ్‌గా తెలడంతో కేజీహెచ్‌ సిీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో చికిత్స నిమిత్తం చేరాడు. రెండు రోజుల పాటు- వార్డులో బాగానే ఉన్న ఆ వ్యక్తి మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గుర య్యాడు. ఒళ్లుతూగడంతో పాటు ఒక్కసారి ఆక్కిజన్‌ లెవెల్స్‌ పడిపోయాయి. దీంతో బ్లాక్‌నుంచి కిందకు పడిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement