Friday, March 29, 2024

నారా లోకేశ్ పై మరో కేసు.. సెక్షన్లు ఏంటంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం నరసరావుపేటలో పర్యటన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. కొన్నినెలల కిత్రం హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు  గుంటూరు జిల్లా నరసరావుపేటకి వెళ్తున్న నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం వచ్చిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం వంటి ఆరోపణలపై సెక్షన్ 186, 341, 269 కింద నారా లోకేశ్ పై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండిః ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement