Wednesday, October 9, 2024

Vijayawada – ఐపీఎస్​ ఆఫీసర్లలో కలవరం – కాదంబరి కేసులో నిందితులుగా నమోదు

హైకోర్టును ఆశ్రయించిన కాంతిరాణా
విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయవాడ: ముంబయి నటి కాదంబరి జ‌త్వానీ సీక్వెల్ 2లో ఏపిసోడ్ ట్విస్ట్ పోలీసు వర్గాల్లో కలవరం రేపింది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారం హైకోర్టు విచారణ స్థాయికి చేరింది. తమను అరెస్టు చేయవద్దని ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్ లు కోర్టుకు మొరపెట్టుకున్నారు. కాదంబరిపై వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులను నిందితులుగా పోలీసులు చేర్చారు. కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో వీరి పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాతా, విశాల్ గన్నీని నిందితులు పేర్కొన్నారు.

కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ పేర్ల న‌మోదు..

కాదంబరీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసును నమోదు చేశారు. కానీ ఐపీఎస్ అధికారుల పేర్లను నమోదు చేయలేదు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో సమర్పించిన రిపోర్టులో ఐపీఎస్ పేర్లను జోడించారు. దీంతో పోలీసు వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. ముందస్తు బెయిల్ కోసం విజయవాడ సీపీ కాంతి రాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకూ బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement