పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ’’ పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు?. ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబూ? అందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రిని చేసింది?’’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
నారాయణ అరెస్ట్ పై విజయసాయి స్పందన

Previous articleతగ్గని కేజీఎఫ్2 జోరు – మెహబూబా ఫుల్ వీడియో సాంగ్
Next articleKurnool: పాఠశాలలో దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారంటే..
Advertisement
తాజా వార్తలు
Advertisement