Tuesday, September 28, 2021

లారీ – బైక్ ఢీః ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం..

విజయనగరంలో నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మ‌ర‌ణం చెందారు.. బైక్‌ వెళ్లున్న ఇద్దరు వ్యక్తులను గజపతినగరం వైపు నుంచి ఐరన్ ఓర్ లోడుతో వస్తున్న లారీ ఆ ఇద్ద‌రు ప్ర‌యాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. అనంతరం సుమారు 50 మీటర్లు ప్రయాణించి రెండు విద్యుత్ స్తంభాలను ద్వంసం చేసి, సమీపంలోని రైస్ మిల్లు ప్రహరీ గోడను ఢీకొట్టి లారీ నిలిచింది. సంఘటన ప్రాంతం భీభత్సంగా మారింది. మృతిచెందిన ఇద్దరిలో ఒకరు ఏ.ఆర్. కానిస్టేబుల్ రామరాజు కాగా మరో వ్యక్తి సీతం కళాశాల ఫ్యాకల్టీ సంజీవ్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News