Wednesday, April 24, 2024

ఒడిశా అదికారుల‌పై తిర‌గ‌బ‌డ్డ కొఠియా ఓట‌ర్లు….

విజయనగరం/సాలూరు రూరల్ ) విజయనగరం జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో 67.13 శాతం పోలింగ్‌ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి మొత్తం 14,46,983 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుండగా 9,71,399మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కొఠియా గ్రామల్లో పోలింగ్‌ శాతం అత్యల్పంగా నమోదైంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రా మధ్య వివాదస్పదంగా ఉన్న కొఠియా గ్రూపు గ్రామాల్లో హై -టె-న్షన్‌ నెలకొన్న అనంతరం ఆంధ్రా అధికారుల చొరవ, తెగువ కారణంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అయితే ఓటింగు శాతం గణనీయంగా తగ్గింది. సాలూరు మండలంలో 16 ఎంపిటిసి సిగ్మెంట్లు-ండగా వాటిలో కొఠియా గ్రూపు గ్రామాలైన 21 గ్రామాల్లో కొన్ని గ్రామాలు గంజాయి భద్ర, పగులుచెన్నూరు, పట్టు-చెన్నూరు పంచాయతీల పరిధిలో ఉండగా కుంభిమడ, నేరెళ్లవలస గ్రామాల ఓటర్లను సారిక గ్రామం పిఎస్‌ కి కేటాయించగా డెన్సరాయి ఓటర్లకు కురుకూటి పోలింగ్‌ కేంద్రం తొమ్మిదికి కేటాయించారు.అయితే వివాదాస్పద గ్రామాలైన కొఠియా గ్రూపు గ్రామాల్లో ఎన్నికలు జరగనివ్వకుండా ఒడిశా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసారు. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈమేరకు కోఠియా గ్రూపు గ్రామాల నుండి ఓటర్లు బయటకు రాకుండా ఉండేలా గ్రామాల చుట్టూ రాళ్లు పేర్చి పోలీసులను మోహరించారు. అలాగే 60 మంది ఒడిశా పోలీసులను మైదాన ప్రాంతంలో ఉన్న నేరెళ్లవలస గ్రామం పంపంచి గ్రామస్తులు ఓటింగులో పాల్గొనకుండా చూస్తూ, గంజాయి భద్ర ఓటర్ల కోసం అక్కడ ఏర్పాటు- చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రాకుండా కట్టు-దిట్టమైన చర్యలు చేపట్టారు. గ్రామం ముఖద్వారం వద్ద ఇతరులు లోనికి రాకుండా బారికేడ్లు, -టె-ంటు-లను వేసి తిష్ట వేసారు. అయితే బుధవారం రాత్రి సాలూరు తహసీల్దార్‌ శ్రీనివాసరావు, సిఐ అప్పల నాయుడు, రూరల్‌ ఎస్‌ఐ దినకర్‌ తోపాటు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు హుటాహుటిన నేరెళ్లవలస తరలి వెళ్లారు. రాత్రి కొంత సమయం వాగ్వివాదం జరిగిన అనంతరం గురువారం ఉదయం కొండల పైన ఉన్న గ్రామాల ఓటర్లు తమ ఓటు- వేసేందుకు రాకుండా అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. పై గ్రామం ప్రజలు నేరెళ్లవలస, సారిక గ్రామాల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు గొర్లె రాజారావు తదితరులతో కలిసి ఒడిశా వారు వేసిన -టె-ంటు-లను కూలదోసి బారికేడ్లను తొలగించారు. అనంతరం నేరెళ్ల వలస నుండి సారిక గ్రామం వెళ్లి తమ ఓటు- హక్కును వినియోగించుకున్నారు. ఈ దశలో నేరెళ్ల వలస విచ్చేసిన ఐటిడిఎ పీఓ కూర్మనాధ్‌ గంజాయి భద్ర ఓటర్లు రాకపోవడం, అప్పటికి కేవలం ఏడుగురు మాత్రమే ఓటు- వేసారని, ఓటర్లు రాకుండా ఒడిశా అధికారులు, పోలీసులు అడ్డుకున్నా రని తెలుసుకొని తమ అధికారులతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఉన్నఒడిశా అధికారులను నిలదీశారు. అనంతరం పీవో, సబ్‌ కలెక్టర్‌ విదేఖరే లు ఓటర్ల కోసం గంజాయి భద్ర తదితర గ్రామాలకు పోలీసుల సహకారంతో వాహనాలను పంపించి ఓటర్లను రప్పించారు. అదేవిధంగా పట్టు-చెన్నూరు, పగులుచెన్నూరు ఓటర్లు తోణాం వచ్చి ఓట్లు- వెయ్యగా వీరిలో పట్టు-చెన్నూరు పంచాయతీ పరిధిలోని 1025 మందికి గాను 38 శాతంతో 382మంది, పగులు చెన్నూరు పంచాయతీకి చెందిన 526మంది ఓటర్లకు గాను 45 శాతంతో 217మంది ఓటర్లు తమ ఓటు- హక్కును వినియోగించు కున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement