Friday, April 19, 2024

విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం – అక్సిజన్ కొరతతో ఇద్దరి మృతి…

విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుప్రతిలో మహా విషాదం సంభవించింది.. ఈ ఆసుపత్రిలో అక్సిజన్ కొరత ఏర్పడటంతో ఇప్పటి వరకు ఇద్దరు రోగుల వరకు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు.. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ హాస్పటల్లో సుమారు 25 మంది కొవిడ్ రోగులు వెంటిటేషన్ పై చికిత్ప పొందుతున్నట్లు చెబుతున్నారు.. గత అర్ధరాత్రి నుంచి ఈ హాస్పటల్లో అక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో వెంటిటేషన్ పై అత్యవసర చికిత్స పొందుతున్న పలువురు రోగులు మరణించారు.. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ హరి జవహార్ లాల్ హాస్పటల్ కు వెళ్లారు.. కొవిడ్ రోగులను ఇతర హాస్పటల్స్ కు తరలించారు.. దీనిపై కలెక్టర్ హరి జవహర్ లాల్ స్పందించారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని… వారు కూడా ఆక్సిజన్ సరఫరా అందక చనిపోలేదని వివరించారు. రోజువారీ కరోనా మృతులు నేపథ్యంలో ఈ రెండు మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్  సరఫరాలో ఇబ్బంది తలెత్తిందని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బల్క్ సిలిండర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం 290 మంది రోగులు ఉన్నారని…వారిలో 25 మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారందరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. వైజాగ్ నుండి మరో ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పిస్తున్నామని… ఇతర పరిశ్రమల నుండి కూడా ఆక్సిజన్ తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌లో ప్రెజర్ తక్కువగా రావటం వల్ల ఇబ్బంది నెలకొందని వెల్లడించారు. ఇప్పటికే పునరుద్ధరణ చర్యలు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కొందరు రోగులను తరలించామని… మరికొందరిని వైజాగ్ తరలిస్తున్నట్లు కలెక్టర్  హరిజవహర్‌లాల్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement