Saturday, December 7, 2024

AP | చిలకలూరిపేట కోఆర్డినేటర్‌గా విడదల రజిని..

మాజీ మంత్రి విడదల రజినీకి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట కోఆర్డినేటర్‌గా రజినిని నియమించారు. అదే విధంగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా వనమా బాలా వజ్రబాబుని నియమితులయ్యారు.

కాగా, గతంలో చిలకలూరిపేట నుంచి రజినీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ సమన్వయకర్తగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement