Thursday, April 18, 2024

వీరేపల్లి చెరువుకు భారీగా నీరు …

ఉలవపాడు రూరల్ ప్రభ న్యూస్ : మండలంలోని వీరేపల్లి గ్రామం పెద్ద చెరువు నిండి అలుగులు పారుతున్న సంఘటన చోటు చేసుకుంది. వరుస తుఫానులు , రుతుపవనాల రాకతో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చెరువులోని నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ , ఆదివారం మధ్యాహ్నానికి చిన్న అలుగు, పెద్ద అలుగు రెండు పారడంతో రైతులలో ఆనందం వెళ్లి విరిసింది. నవంబర్ ముందు నెల వరకు సరైన వర్షాలు లేక ఈ సంవత్సరం పంటలు వేయగలమా..లేదా అన్న సందిగ్ధంలో ఉన్న రైతులకు నవంబర్ లోని వరస తుఫానులు ఊపిరిపోశాయి. ఒకేరోజు పెద్ద అలుగు, చిన్న అలుగు రెండు పారడంతో స్థానిక చెరువును గ్రామ రెవిన్యూ అధికారి బాల చందర్ పరిశీలించి, సమాచారాన్ని పై అధికారులకు అందించారు.

గతంలో ఇవే అలుగులు ఉధృతంగా ప్రవహించి, పక్కనే ఉన్న గిరిజన కాలనీ (పడమర సంఘం) లోనికి ప్రవహించడంతో కాలనీకి, గ్రామానికి సంబంధాలు తెగిపోయి అక్కడ నివసించే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు గురి అవడంతో, ఈ సారి ముందు జాగ్రత్తగా రెవిన్యూ అధికారులు, మాజీ సర్పంచ్ పోతురాజు అలుగులు పారుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, వర్షాలు ఇదే విధంగా పడుతూ ఉంటే ముందు జాగ్రత్తగా తగిన చర్యలు చేపడతామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవిన్యూ అధికారి బాల చందర్ వెంట వి.ఆర్.ఏ లు, వాలంటీర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement