Friday, April 19, 2024

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగo అక్కర్లేదా?: కేసీఆర్ పై ఏపీ టీడీపీ నేత ఫైర్

రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” క్రొత్త రాజ్యాంగo కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి. అంటే, డా: అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగo అక్కర్లేదా? అవుసరమైనప్పుడు రాజ్యాంగానికీ చేర్పులు చేసుకొనే అవకాశముందని ఆయనకు తెలియదా? ఈ మాత్రo తెలియకుండా, అసలు క్రొత్త రాజ్యాంగo కావాలంటే, అంబేడ్కర్ ను అవమానించినట్లే, అర్ధo చేసుకోండని మనవి” అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

కాగా, నిన్న కేంద్ర బడ్జెట్​పై స్పందించిన సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాజ్యాగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికి 80 సార్లు సవరించారని, దేశాన్ని బాగు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని, మన దేశంలోనూ అది జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement