Wednesday, December 7, 2022

జగన్ పాలనలో హత్యా రాజకీయాలు

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య దారుణ హత్యపై ఆపార్టీ నేత వ‌ర్ల రామ‌య్య తీవ్రంగా స్పందించారు. జగన్ పాలనలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయంటూ మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీ పాలనలో హత్యా రాజకీయాలు పెరిగి పోతున్నాయి. అధికార పార్టీ అహంకారానికి ఒక కుటుంబం పల్నాడులో బలైంది. అందరూ సంక్రాంతి జరుపుకుంటుంటే, ఆ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రశాంతంగా వుండే గ్రామాలను రాజకీయ కక్షా కేంద్రాలుగా మార్చారు. ఇదేనా రాజన్న రాజ్యం, మీరే ఆలోచించండి’ అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement