Thursday, December 5, 2024

AP | యూనిఫైడ్ పెన్షన్ పథకం ఒక గేమ్ చేంజెర్..

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : దేశంలోని అన్ని ప్రాంతాల ఆర్థిక నిపునుల విస్తృత సంప్రదింపులతో నూతన ఏకీకృత పెన్షన్ పథకం (Unified Pension Scheme) రూపొందించడం జరిగిందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత కల్పించే విధంగా ఈ పెన్షన్ ను రూపొందించారని ఇది ఒక గేమ్ చేంజర్ వంటిదన్నారు.

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సుమారు 18 వేల మంది ఉద్యోగులు దీని ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఏకీకృత పెన్షన్ పథకంపై ఆయన మంగళవారం విజయవాడలోని రైలు నిలయంలో ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను వివరించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకం ఒక గేమ్ ఛేంజర్ అని, హామీ ఇవ్వబడిన పెన్షన్, ద్రవ్యోల్బణ సూచిక డియర్నెస్ రిలీఫ్, ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక నిపుణులతో విస్తృత సంప్రదింపుల అనంతరం పాలసీ రూపొందించామని చెప్పారు. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) చందాదారులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల ప్రకటించిన ఏకీకృత పెన్షన్ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్‌లోని దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లోని మొత్తం 18,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 14,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

- Advertisement -

విజయవాడ డివిజన్, ఎస్‌సిఆర్‌లోని సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ కట్ట ఆనంద్ మాట్లాడుతూ ఎన్‌పిఎస్ నుండి యుపిఎస్‌కి ఒక సారి మారే అవకాశం ఉందని, ఒకసారి ఎంపిక చేసుకుంటే మళ్లీ ఎన్‌పిఎస్‌కి మారడం లేదని అన్నారు.

ఉద్యోగుల సహకారం అలాగే ఉందని, అయితే ప్రభుత్వ సహకారం 14% నుండి 18.5%కి పెంచబడిందని హైలైట్ చేశారు. ఈ పాలసీకి మరో బోనస్ ఫీచర్ అయిన సూపర్‌యాన్యుయేషన్ గ్రాట్యుటీకి అదనంగా ఏకమొత్తం చెల్లింపు ఉంటుందని చెప్పరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement