Thursday, November 7, 2024

AP | ఈతకు వెళ్లి ఇద్దరు మృతి…

చిత్తూరు, (ప్రభ న్యూస్ బ్యూరో) : ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన బంగారుపాళ్యం మండలంలో ఊటువంక చెరువు వద్ద గురువారం చోటు చేసుకుంది. బంగారుపాళ్యం మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఖాదర్ భాషా కుమారుడు తోహిద్ (16), మహబూబ్ షరీఫ్ కుమారుడు ఇర్ఫాన్ (16) మరో యువకుడితో కలిసి ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో చెరువులో భారీ గోతులు ఉండడంతో అందులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

మృతదేహాలను బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో నధువారిపల్లి శోకసముద్రంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement