Monday, March 18, 2024

రెండు టీచ‌ర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో వైసిపి విజయం

అమ‌రావ‌తి – ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. తూర్పు రాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ఆయ‌న సుమారు రెండు వేల ఓట్ల ఆధీక్యంతో గెలుపొందారు..


‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాగా, ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలలో మాత్రం వైసిపి కి గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది.. మొత్తం మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా రెండు చోట్ల టిడిపి సంపూర్ణ‌మెజార్టీ తో దూసుకుపోతున్న‌ది.. రాయ‌ల‌సీమ స్థానంలో వైసిపి,టిడిపి ల మ‌ధ్య పోరు హోరాహోరిగా కొన‌సాగుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement