Friday, April 19, 2024

తెలుగు రాష్ట్రాల్లో.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వార్షాలు మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి ఉత్తర అండమాన్‌ సముద్రం వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

వీటి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement