Saturday, October 12, 2024

Kurnool: పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో పిడుగుపాటుకు శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక ప్రాంతం ఉత్తునూరు గ్రామానికి చెందిన వ్యక్తులు. వీరు పని నిమిత్తం విరుపాపురంకు వచ్చారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో అక్కడే ఓ ఇంటి కింద తలదాచుకున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల ఒక్కసారిగా పిడుగులు పడడంతో.. వీరు మృతి చెందడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement