Friday, November 8, 2024

AP | ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు రెండు సర్టిఫికేట్లు !

ఏపీ ఇంటర్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఒకేషనల్ విద్యార్థులకు సాధారణ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌తో పాటు, నేషనల్ సెంటర్ ఫర్ ఒకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (NCVTE) సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.

ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో చేరాలంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. ఉద్యోగాలకోసమే కాకుండా ఉన్నత విద్యకు కూడా ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపయోగపడేలా ఎన్‌సీవీటీఈ సహకారంతో సర్టిఫికెట్లు జారీ చేయాలని ఏపీ ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement