Sunday, December 1, 2024

AP | రెండు ఆటోలు ఢీ.. ఇద్దరి మృతి

ఆదోనిలో రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… కార్తీక మాసం సందర్భంగా ఉరుకుంద నరసింహ స్వామిని దర్శనార్థం ఆదోని నుంచి ఆటోలో వెళ్తుండగా.. గణేకల్ వద్ద ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్నాయి.

ఈ ఘటనలో కర్ణాటక చిత్రదుర్గకు చెందిన వీసన్న (50), బళ్లారికి చెందిన రత్నాబాయి(40) అక్కడికక్కడే మృతి చెందారు. గాయప‌డిన మ‌రో ఆరుగురిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement