Friday, December 6, 2024

Tungabhadra – కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు

నీట కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు.

. 35 వేల క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకు. . జలాశయంకు వరద తగ్గడంతో గేట్ల ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదం. .

డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం

70 ఏళ్లలో ఇదే తొలిసారి..

తెల్లవారుజామున 4 గంటలకు ఘటన. . కర్నూలు జిల్లా నది తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన. .

- Advertisement -

2009 వరదలను గుర్తుకు తెస్తున్న ఘటన..

ఆందోళన అవసరం లేదంటున్న జలాశయ అధికారులు. .

డ్యామ్ ను ఖాళీ చేసేందుకు దిగివకు నీటి విడుదల.

. 33 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు దిగువ నదిలోకి.

కర్నూలు బ్యూరో – కర్ణాటకలోని హోస్పేట్ లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 లో గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్రజలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు వరద వృధాగా వెళ్తున్నాయి.ఎగువ వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను మేటెనెన్సు చేసే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 100 టి ఎంసిలకు పైగా నీళ్లు ఉన్నాయి. ఇందులో 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదులుతున్నారు.

డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి.ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పరిధిలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాలతో పాటు కర్నూలు నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తుంగభద్ర జలాశయం ఇంజనీర్లు సూచించారు.

మొత్తం 48 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. దీంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్రదించండని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

Advertisement

తాజా వార్తలు

Advertisement