Wednesday, April 24, 2024

చదవు చెప్పాల్సిన గురువే… కామంతో…

ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. భవిష్యత్తు బాటను తీర్చిదిద్దే గురువు స్థానంలో ఉన్న వ్యక్తి.. కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు. తన దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చిన బాలికపై కన్నేశాడు. చదువు చెప్పాల్సిందిపోయి.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్ కి వెళ్తోంది. ఆ ట్యూషన్ మాస్టర్.. బాలికపై కన్నేశాడు.

సమయం చూసి.. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. నీకు తెలివి లేదు.. మేథాశక్తి పెంచుతాను.. నీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ బాలికను లోబరుచుకున్నాడు. కొన్ని రోజులుగా బాలిక సరిగా తినకపోవడం, నీరసంగా ఉండటంతో ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు పరిశీలించి బాలిక గర్భవతి అని చెప్పారు. అప్పటికే బాలికకు ఎనిమిది నెలలు రావడం గమనార్హం. వెంటనే బాధితులు దిశ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. నిందితుడికి అప్పటికే పెళ్లైంది. భార్య కూడా ఉంది. కాగా.. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలికపై కన్నేసి గర్భవతిని చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement