Monday, May 17, 2021

క‌రోనాను టిటి”ఢీ” కొట్టాలి…

మానవ సేవే మాధవ సేవ
కష్టకాలంలో ధార్మిక సేవలకే పరిమితం కారాదు
కోవిడ్‌ రోగులను ఆదుకోవాలి
కల్యాణ మండపాలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా ఉపయోగించాలి
ఇప్పటికే రంగంలోకి ఇతర మతసంస్థలు… కోవిడ్‌ రోగులకు సేవలు
కోవిడ్‌ సేవలతోనే గోవిందుడి ఆశీస్సులు
అప్పుడే భక్తి విశ్వాసాలు పెరుగుతాయంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కోవిడ్‌ రోగుల సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు రావాలి. కేవలం తిరుపతికి మాత్రమే సేవల్ని పరిమితం చేయకూడదు. టిటిడికి ఉభయ తెలుగు రాష్ట్రాల్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సొంత కళ్యాణమండపాలు న్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే వందకు పైగా కళ్యాణమండపాల్ని టిటిడి నిర్మించి నిర్వహిస్తోంది. ఇవన్నీ విశాలమైన ప్రాంగణాలు. పైగా పట్టణాలు, నగరాలకు నడిబొడ్డునున్నాయి. చుట్టూ పెద్దపెద్ద ఆవరణలు. నీరు, విద్యుత్‌ ఇలా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో వివాహాలు, ఇతర సాంస్కృ తిక కార్యక్రమాలకు మాత్రమే అనుమతులిస్తారు. ప్రస్తుతం వివాహాల సీజన్‌ లేదు. ఉన్నా 50మందికి మించి హాజరయ్యేందుకు వెసులుబాటు లేదు. దీంతో ఇవన్నీ దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. వీటిని తాత్కాలికంగా కోవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా టిటిడి మార్చాలి. ఆయా ప్రాంతాల్లోని హోమ్‌ ఐసోలేషన్‌కు సిఫార్స్‌చేయబడ్డ కోవిడ్‌ రోగులకు ఇందులో బస చేసే అవకాశం కల్పించాలి. టిటిడి తరపున డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించాలి. వారికున్న మౌలిక సదుపాయాల మేరకు ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు మత సంస్థలు కోవిడ్‌ను ఎదుర్కొనే ప్రక్రియలో తమ వంతు సాయాన్నందిస్తున్నాయి. షిర్టీ సంస్థానం ఐదొందల కోట్ల ఆర్ధిక సాయాన్ని పిఎమ్‌ కేర్స్‌కు అందించింది. అలాగే అమృ త్‌సర్‌లోని సిక్‌ గురుద్వార్‌ ద్వారా ఆర్దిక సాయాన్నం దజేసింది. పలు ముస్లిం సంస్థలు తమకున్న మదర్సా లను కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగించుకోమంటూ ప్రభుత్వానికి లేఖలిచ్చారు. అలాగే కొన్ని చర్చిలకు అనుబంధంగా ఉన్న విద్యాసంస్థల్ని కోవిడ్‌ కేర్‌ కేంద్రా లుగా మార్చుకోమంటూ ప్రభుత్వాన్ని కోరారు. గుజ రాత్‌లోని సోమనాధ్‌ ఆలయం తరపున పెద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్మించి నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జైన్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సొం తంగా పెద్ద పెద్ద భవనాల్ని అద్దెకు తీసుకుని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్యవైశ్యులు కూడా కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసి నిర్వహించుకుంటున్నారు. కుల, మత ప్రాతి పది కన కూడా కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటౌతున్నాయి.
దేశంలోనే అతిపెద ఆధ్యాత్మిక వ్యవస్థ టిటిడి. దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇదే. టిటిడి ఇప్పటికే పలురంగాల్లో తన సేవల్నందిస్తోంది. వైద్యపరంగా కూడా ఆసుపత్రుల్ని నిర్వహిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, ధర్మ ప్రచార పరిషత్‌కు కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తోంది. టిటిడికి వస్తున్న ఆదాయమంతా భక్తులిచ్చే కానుకల ద్వారానే సమకూరుతోంది. ప్రస్తుతం అదే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవి డ్‌తో సతమతమౌతున్నారు. కోవిడ్‌ పాజిటీవ్‌ వచ్చిన వ్యక్తుల్లో 80శాతానికి పైగా హోమ్‌ క్వారంటైన్‌కే పరిమితమౌతున్నారు.వీరెవరూ ఆసుపత్రు లకెళ్ళా ల్సిన అవసరంలేదు.
అయితే ప్రస్తుతం రోగికి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి 95శాతం కుటుంబాలకు లేదు. కేవ లం ఉన్నత స్థాయి కుటుంబాలు మినహా మధ్యతరగతి, పేద కుటుం బాలన్నీ ఒకట్రెండు గదుల ఇళ్ళల్లోనే జీవితం గడుపు తున్నాయి. పైగా వీరుండే ప్రాంతంలో జనసాంధ్రత అధికంగా ఉంటుంది. సహజంగానే కోవిడ్‌ రోగి తమ మధ్యనుంటే పరిసర వాసుల్లోనూ భయం కలుగు తుంది. ఆ కుటుంబాన్ని వెలేసినట్లు చూస్తారు. ఇది ఆ కుటుంబీకుల్లోనూ అపరాద భావాన్ని కలుగజేసే ప్రమాదముంది. అలాగని ప్రభుత్వం పెద్దసంఖ్యలో కోవిడ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేసి నిర్వహించలేక పోతోంది. తొలివిడతలో ఈ మేరకు చేసిన ప్రయత్నం సఫలమైంది. అయితే ఇందుకు భారీగా ఖర్చవుతోంది.
టిటిడికి సామాజిక బాధ్యతుంది. కేవలం ధర్మ ప్రచారానికి, వేదాధ్యయానికి, ఆలయాల పునరుద్ద రణకు మాత్రమే పరిమితం కావడం సరికాదు. వైద్యశాలల నిర్వహణను తిరుపతి పరిసర ప్రాం తాలకు మాత్రమే పరిమితం చేయడం ఆమోద యోగ్యం కాదు. టిటిడికి తెలుగు రాష్ట్రాల్తో పాటు దేశవ్యాప్తంగా భక్తులున్నారు.వారంతా ఇస్తున్న విరాళాల్తోనే గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఈ కార్యక్ర మాలన్నింటికి నిధులు కేటాయించగలుగుతోంది. ప్రస్తుతం టిటిడి కళ్యాణ మండపాలన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయి.
నిర్వహణ కూడా జరగడంలేదు. పెద్ద పెద్ద భవనాలు, విశాల ప్రాంగణాల్లో ఉన్న ఈ కళ్యాణ మండపాల్ని కనీసం రెండుమూడు మాసాల పాటు కోవిడ్‌ ఉదృతి తగ్గేవరకు ఈ రోగుల కోసం కేర్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే టిటిడి ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. తాము నిత్యం పూజించే బాలాజీయే తమకీ రూపంలో కూడా రక్షణ కల్పించాడన్న ఆనందం భక్తుల్లో కలుగుతుంది. టిటిడి పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News