Monday, October 7, 2024

AP | డిప్యూటీ సీఎం పవన్ తో టీటీడీ ఈవో భేటీ !

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తో టీటీడీ ఈవో జె.శ్యామలరావు భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు.

గత పాలకమండలి హయాంలో లడ్డూల తయారీలో కల్తీ జరిగినట్లు ఈవో శ్యామలరావు వివరించారు. నెయ్యి సరఫరాదారును ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను పవన్‌కు తెలియజేశారు. కల్తీ నెయ్యి వినియోగానికి అనుమతించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే విషయంలోనూ, ధార్మిక అంశాల అమలులోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement