Sunday, April 14, 2024

టీటీడీ డొమైన్ లోనే దర్శన టికెట్లు: వై వి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉచిత దర్శన టికెట్లు తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. అయితే అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్ లో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

సేవాభావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చిందని… జియో క్లౌడ్ ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు.స్వామివారి దర్శంనం టికెట్ల బుకింగ్స్ లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని… దీన్ని అధిగమించేందుకు దాదాపు రూ. 3 కోట్ల విలువైన సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలను అందించేందుకు జియో ముందుకొచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే నెలలో పూర్తిగా టీటీడీ డొమైన్ లోనే దర్శన టికెట్లు విడుదల చేస్తామని వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement