Thursday, April 25, 2024

ఎపిఎస్ఆర్టీసీలో బ‌దిలీల క‌ల‌వ‌రం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉద్యోగులకు మరో భారీ కుదుపు. ప్రభుత్వం కేడర్‌ స్ట్రెంత్‌ నిర్ణార ణతో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీ అనివార్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపధ్యంలో ఇప్పటి వరకు 31,723(61.61శాతం) మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీలో వివిధ కేడర్‌లలో 51,488 మంది ఉద్యోగులు ఉండగా..ఇప్పటి వరకు 31,723 మందిని బదిలీ చేశారు. మరో 19,765 మందిని బదిలీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటు న్నారు. ఇప్పటి వరకు బదిలీ చేసినట్లు అంకెలు చూపుతున్నా..ఉద్యోగులను కదలించలేదు. అయితే ప్రభుత్వం గట్టిగా పట్టుబడితే బదిలీ అనివార్యంగా మారే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుల్వంలో విలీనం చేయాలంటూ కోరతున్న నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి 1వ తేదీన ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. గతంలో కార్పోరేషన్‌ లో ఉన్నప్పుడు పదవీ విరమణ తర్వాత ఫెన్షన్‌, ప్రభుత్వ పరమైన ప్రయోజనాలు అందకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కోరుకున్నారు.

అయితే ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అప్పటి వరకు ఉన్న ఒక్కొక్క ప్రయోజనాన్ని తొలగిస్తూ రావడంతో పాటు పాత పెన్షన్‌ ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. ఇదే సమయంలో కొత్త పీఆర్సీలో కూడా తగిన న్యాయం జరగలేదని ఉద్యోగులు భావిస్తున్నారు. గతంలో ఆర్టీసీ కార్పోరేషన్‌ ఉద్యోగు లుగా ఉన్నప్పుడు నాలుగేళ్ల కోసారి పీఆర్సీ ఇస్తే.. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఐదేళ్ల కోసారి పీఆర్సీ వస్తుంది. పైగా ప్రభు త్వంలో విలీనానికి ముందు పీఆర్సీ బకాయిలు, పెండిం గ్‌ డీఎలు సహా అనేక సమ స్యలపై ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో అధికారులు, ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో 2096 మంది ఉద్యోగుల పదోన్నతులపై ఆర్థికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీరికి కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించక పోవడంతో ఎట్టకేలకు ఇటీవలనే సమస్యను పరిష్కారం చేసుకు న్నారు.

ఈ క్రమంలోనే కేడర్‌ స్ట్రెంత్‌ పేరిట ఉన్న ఉద్యోగులకు స్థాన చలనం కలిగిం చాలంటూ ప్రభు త్వం ఆదేశించడం ఉద్యోగులను కలవరపాటుకు గురి చేసింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఎనిమిది మంది డెప్యూటీ సూపరిం టెండెంట్లు అదనంగా ఉన్నట్లు పేర్కొనడంతో పాటు సూపరింటెండెంట్లు కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు అదనంగా ఉన్న వారిని వేర్వేరు జోన్లకు బదిలీ చేయాల్సి వస్తోంది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో 41మంది గ్రేడ్‌-1 కండక్టర్లు విధులు నిర్వహిస్తుం డగా..ఇక్కడ గ్రేడ్‌-2 కండక్టర్లు ఉంటే సరిపోతుందని కేడర్‌ స్ట్రెంత్‌లో నిర్థారించారు. ఇలా ప్రతి జోన్‌ మొద లు డిపో స్థాయి వరకు కేడర్‌ స్ట్రెంత్‌ నిర్థారించడంతో ఇప్పుడున్న వారిని పెద్ద ఎత్తున బదిలీ చేయాల్సి ఉంటుంది. లేదంటే వీరిని ఇదే స్థానాల్లో కొనసాగిస్తూ వేరే చోట అటెండెన్స్‌ చూపాల్సి ఉంటుంది. దీనిపై అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇప్పటికే వారిని బదిలీ చేసినట్లు మాత్రం రికార్డుల్లో పేర్కొన్నారు. మరో వైపు జూని యర్‌ స్కేలు అధికారుల కేడర్‌ స్ట్రెంత్‌ విషయంలో ప్రత్యేకంగా స్ట్రెక్చర్‌ రూపొందిం చిన అధికారులు.. సీనియర్‌ స్కేలు అధికారులు మాత్రం ప్రధాన కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా కేడర్‌ స్ట్రెంత్‌ స్ట్రెక్చర్‌లో ఖాళీలను చూపించారనేది ఉద్యో గుల ఆరోపణ. ప్రభుత్వంలో విలీనమైతే పలు ప్రయో జనాలు పొందొచ్చని ఆశించిన తాము..ఇప్పుడు రకరకాల మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మనే ఆవేదను ఆర్టీసీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement