Thursday, April 25, 2024

Breaking: ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీలు అయ్యారు. సీఎం స్పెషల్ సీఎస్ గా పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి బి.రాజశేఖర్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మధుసూదన్ రెడ్డి, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ లు బదిలీ అయ్యారు.

ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకయ్యారు. సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement