Friday, October 4, 2024

Trains Cancelled | అలర్ట్.. పలు రైళ్లు రద్దు, వివరాలివే !

రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం చేసింది…. హసన్‌పర్తి నాలుగో రైల్వే లైన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో పలు రైళ్లను ఈ నెల 26 నుంచి అక్టోబరు 8 వరకు పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దయిన ట్రైన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

రామగిరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17003/04), సింగరేణి ( ట్రైన్ నెంబర్ 17034/34), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12757/58), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నెంబర్ 17011/12), భాగ్యనగర్ (ట్రైన్ నెంబర్ 17233/34 ), గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ( 17201/02 ట్రైన్ నెంబర్), గుంటూరు ఇంటర్‌ సిటీ ( ట్రైన్ నెంబర్ 12706/05), శాతవాహన సూపర్‌ ఫాస్ట్ (ట్రైన్ నెంబర్ 12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్ (17660/59), కాజీపేట జంక్షన్‌ – డోర్నకల్‌ జంక్షన్‌ పుష్‌పుల్ (07753/54 ), కరీంనగర్‌-సిర్పూర్‌టౌన్‌ పుష్‌పుల్ (07765), విజయవాడ – గుంటూరు ట్రైన్లు (07464/65) రద్దు కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement