Saturday, October 5, 2024

AP | విహారయాత్రలో విషాదం… జలతరంగిణిలో వైద్య విద్యార్థులు గల్లంతు !

ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జలతరంగిణి వద్ద ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ఐదుగురు వైద్య విద్యార్థులు గ‌ల్లంత‌య్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా… మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు అందవలసిఉంది. కాగా, ఏలూరు ఆశ్రమ మెడికల్‌ కళాశాలకు చెందిన 14 మంది వైద్య విద్యార్థులు (ఆదివారం) మారేడుమిల్లి జలతరంగిని జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement