Monday, December 9, 2024

Tirumala – కాలి బాట భ‌క్తుల టోకెన్ల స్కానింగ్ – మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తిని తీసుకొచ్చిన టిటిడి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతీరోజూ వేలాది మంది దర్శించుకుంటారు.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. మరోవైపు.. ప్రతీరోజూ వేలాది మంది నడక మార్గంలో తిరుమల వెళ్తుంటారు.. శ్రీవారిని దర్శించుకుంటారు.. ఇప్పుడు నడక మార్గంలో తిరుమల వెళ్తున్న భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు జారి చేసే టోకేన్ల స్కానింగ్ పున:ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది..

శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో మార్పులు చేశారు అధికారులు.. దీంతో, స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారి చేసే టోకేన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్‌ అధికారులు.. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాని కోనసాగించాలని అధికారులను ఆదేశించారు ఈవో శ్యామ‌ల‌రావు..

- Advertisement -

శ్రీవారి ద‌ర్శనానికి 20 గంట‌లు..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం వారికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది ఇక‌. 75 వేల 125 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా, 31 వేల 140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 5 కోట్ల 41 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement