Friday, October 4, 2024

Tirumala – ల‌డ్డు ప్ర‌సాదంలో పొగాకు – పేక్ న్యూస్ అన్న టిటిడి

సోష‌ల్ మీడియాలో ఫేక్ వీడియోలు
ఇటువంటి వాటితోనే అపార్ధాలు
అక‌తాయి చేష్టల‌తో న‌ష్టాలు ఎక్కువ
సిసి టివి ప‌ర్య‌వేక్ష‌ణ‌లు శ్రీవారి ప్ర‌సాదం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ”పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం భావ్యం కాదు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో రోజూ లక్షలాదిగా లడ్డూలను తయారు చేస్తారు. ఈ తయారీ సీసీ టీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం”అని టిటిడి పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement