Sunday, October 13, 2024

Tirumala – శాంతి హోమంతో ల‌డ్డూ దోషాలు తొలిగాయి…. టిటిడి ఈ వో

తిరుమ‌ల – శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టిటిడి ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో, ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామి వారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. . పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయిందని అన్నారు. మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశామని చెప్పారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో జరిగిన మహా పాపానికి పరిహారంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement